శ్రీకాకుళం జిల్లాలో అమానుషం... భార్యా బిడ్డను కత్తితో నరికిన కసాయి

Feb 17, 2023, 4:58 PM IST


శ్రీకాకుళం : కట్టుకున్న భార్య, కన్న బిడ్డపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో కసాయి వ్యక్తి. ఈ దాడిలో  తీవ్రంగా గాయపడ్డ కూతురు అక్కడికక్కడే మృతిచెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ అమానుష ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఆముదాలవలస పట్టణంలోని చోట్టవానిపేటకు చెందిన కొల్లి సూర్యం(55)- రామారావు భార్యాభర్తలలు. వీరికి విజయ(30) సంతానం. అయితే భార్య సూర్యంపై అనుమానం పెంచుకున్న రామారావు నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన అతడు భార్యా కూతురుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై విజయ అక్కడికక్కడే చనిపోగా కొనఊపిరితో వున్న సూర్యంను హాస్పిటల్లో చేర్చారు. శ్రీకాకుళం రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు రామారావు పరారీలో వున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.