ఉపాధ్యాయుడి నిర్వాకం.. విద్యార్థితో ఆ పని చేయించి.. చేతులెత్తేశాడు...

Jun 1, 2020, 4:06 PM IST

కర్నూలు జిల్లా అల్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల లో దారుణం జరిగింది. మనోజ్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి చెట్టుపై నుంచి కింద పడి రెండు చేతులూ విరిగిపోయాయి. హిందీ ఉపాధ్యాయుడు బలవంతంగా చింతకాయల కోసం చింత చెట్టు ఎక్కించాడని దిగే క్రమంలో కిందపడి చేతులు విరిగాయని బాధితుడు చెబుతున్నాడు. మొదటి విడత కట్టుకు పదివేలు ఇచ్చాడు కానీ ఇప్పుడు రెండోసారి కట్టు కట్టించాలంటే నా వల్ల కాదంటున్నాడని బాధితుడి తండ్రి వాపోతున్నాడు.