జబర్దస్త్ షోతో పాపులారిటీ సొంతం చేసుకుని సినిమాల్లో రాణిస్తున్న కమెడియన్లు చాలా మందే ఉన్నారు. కమెడియన్లుగా, నటులుగా ఎదగాలనుకునే వారికి జబర్దస్త్ మంచి అడ్డాగా మారింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బుల్లెట్ భాస్కర్, రోహిణి, చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి వాళ్లంతా జబర్దస్త్ తో పాపులర్ అయ్యారు.