వైసిపి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటర్... వైరల్ వీడియో

Published : May 13, 2024, 02:41 PM ISTUpdated : May 13, 2024, 02:47 PM IST
వైసిపి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటర్... వైరల్ వీడియో

సారాంశం

ఎమ్మెల్యే ఓటర్ పై దాడిచేసిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూసింది. అయితే తనను కొట్టిన ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగాడు సదరు ఓటర్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మార 

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుండి రాష్ట్రంలో పోలింగ్ హడావిడి కొనసాగుతోంది. ఈ ఈక్రమంలోనే ఓటేసేందుకు పోలింగ్ బూత్ వద్ద ఎదురుచూస్తున్న ఓటర్ ను అధికార వైసిపి నాయకుడి దాడికి దిగాడు. అయితే సదరు ఓటర్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తెనాలిలో అధికార వైసిపి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ క్యూలైన్ వుండగా దాన్ని పాటించకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించాడు. దీంతో ఓ ఓటర్ ఆయన అలా వెళ్ళడంపై అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఎమ్మెల్యే కూడా తమతో పాటే క్యూలైన్ నిలబడి ఓటేయాలని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే సదరు ఓటర్ పై దాడికి దిగాడు. 

తెనాలి ఎమ్మెల్యే ఓటర్ ను చెంపపై కొట్టాడు. అయితే ఆ ఓటర్ కూడా ఏమాత్రం తగ్గలేదు... తనను కొట్టిన ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగాడు.  అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు. వెంటనే ఎమ్మెల్యే అనుచరులు సదరు ఓటర్పై మూకుమ్మడిగా దాడి చేసారు. 

 

ఈ ఘటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందరికీ ఆదర్శంగా వుండాల్సిన ఎమ్మెల్యే క్యూలో నిలబడి ఓటేసివుంటే బావుండేదని... అలాకాకుండా నేరుగా ఓటేసేందుకు వెళుతూ ప్రశ్నించిన ఓటర్ పై దాడి చేయడం అత్యంత హేయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో నోటికొచ్చినట్లు వాగడం వల్లే ఎమ్మెల్యే సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నాడని అంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం