పచ్చి మిర్చి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 13, 2024, 3:10 PM IST

పచ్చిమిర్చితో చేసిన వంటకాలు బలే టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది మిరపపొడికి బదులుగా చాలా మంది పచ్చిమిరపకాయలనే వాడుతుంటారు. అసలు పచ్చిమిరపకాయలను తింటే ఏమౌతుందో తెలుసా? 

పచ్చిమిర్చి పేరు వినగానే జనాలకు ముందుగా గుర్తొచ్చేది దాని ఘాటైన వాసన,రుచి. పచ్చిమిరపకాయలు దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇది కూరల టేస్ట్ ను పెంచుతుంది. చాలా మందికి దీని తిన్న తర్వాత కళ్ల నుంచి నీళ్లు, చెవుల నుంచి పొగ వచ్చిన అనుభవాలు కూడా ఉంటాయి. కానీ దీని ఘాటైన రుచిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ ఈ పచ్చిమిర్చి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అసలు దీన్ని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రోగనిరోధక శక్తి

పచ్చిమిరకాయలో విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన చర్మం, గాయాలు నయం చేయడానికి సహాయపడతాయి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు.


కణాల నష్టం నుంచి రక్షణ 

పచ్చిమిరపకాయల్లో క్యాప్సైసిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కణాలు దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా తోడ్పడతాయి. 
 


మెరుగైన జీవక్రియ

పచ్చిమిరపకాయల నుంచి వెలువడే వేడి మీ జీవక్రియను పెంచుతుంది. అలాగే ఇది కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంటే పచ్చిమిరపకాయలు కూడా వెయిట్ లాస్ కు సహాయపడతాయి. 
 

ఆర్థరైటిస్, మైగ్రేన్ 

పచ్చిమిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ నొప్పి, మంటను తగ్గిస్తుంది. కాళ్లు, మోకాళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్, మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. 
 

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అధిక రక్త పోటును తగ్గిస్తుంది. అలాగే ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది కూడా. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పచ్చిమిరపకాయలు గ్యాస్ట్రిక్ రసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దీంతో పోషకాల శోషణ పెరుగుతుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పచ్చిమిరపకాయలను తింటే మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు రావు. 


క్యాన్సర్ నుంచి రక్షణ 

కొన్ని అధ్యయనాలు పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇది క్యాన్సర్ నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమవుతాయి. 

Latest Videos

click me!