Nov 16, 2020, 5:22 PM IST
ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన భైరవకోనలో సుందర జలపాతం ఉదృతంగా ప్రవహిస్తున్నది.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ పై నుండి నీరు ఉదృతంగా ఎగసి పడుతున్నది. త్రిముఖ దుర్గాంబ అమ్మవారు కాల భైరవేశ్వరుడు మధ్యలో నీరు ప్రవహిస్తుండడంతో దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. కార్తీక సోమవారం కావడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.