జగన్ కి వాటిమీదున్న శ్రద్ధ కరోనా మీద లేదు...నిమ్మకాయల చినరాజప్ప

Mar 21, 2020, 5:16 PM IST

జగన్ ప్రభుత్వ పనితీరుపై మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ నే బెదిరిస్తున్నారు ఇక సామాన్యుల పరిస్థితేంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీది అరాచకప్రభుత్వం అన్నారు. ఏపీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. ఆ విషయం పట్టించుకోకుండా జగన్ ఎన్నికలకోసం వెంపర్లాడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు.