Jul 27, 2020, 5:28 PM IST
విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు సమీపంలోని గేట్ వే కంటైనర్ యార్డులో సోమవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. కంటైనర్ యార్డులో ఉన్న అల్యూమినియం ఫ్లోరైడ్ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చేలరేగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. విశాఖపట్టణంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.