Dec 15, 2020, 11:32 AM IST
విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు హాల్ చల్ చేస్తోంది. కళ్లికోట-దుగ్గి గ్రామాల మధ్య తిష్ట వేసిన ఏనుగుల గుంపు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది చాలదన్నట్లు తాజాగా ఓ గున్న ఏనుగు ఈ గుంపులో చేరింది. ఈ గ్రామాల శివారులోనే ఓ ఏనుగు గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటివరకు ఐదు ఏనుగుల గుంపుకు తోడుగా మరో పిల్ల ఏనుగుతో చేరింది. ఈ ఏనుగుల గుంపు మన్యంలో అలజడి సృష్టించి పోడు వ్యవసాయంతో పాటుగా వరి పంటలను ధ్వంసం చేస్తోంది. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.