పల్నాడులో విషాదం.. అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య..

Oct 8, 2022, 11:22 AM IST

పల్నాడుజిల్లా : పల్నాడుజిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గోపవరపు వెంకటేశ్వర్లు అంజనాదేవికి 35  సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గోపవరపు వెంకటేశ్వర్లు రైస్ మీల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీళ్ళు ఇద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. గత కొంత కాలంగా వెంకటేశ్వర్లుకి వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల పాలవడంతో  అప్పుల బాధ తాళలేక.. శనివారం తెల్లవారు జామున దంపతులు ఇద్దరు ఇంట్లో ఉరి వేసుకొని బలన్మరనానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.