Dec 2, 2020, 8:47 PM IST
పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా బుధవారం ఏపీ అసెంబ్లీలో అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని సీఎం జగన్ అన్నారు.
గతంలో పోలవరం సందర్శన పేరుతో చంద్రబాబు పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జగన్ విమర్శించారు. చంద్రన్న భజన చేయడం కోసం ఏకంగా రూ.83 కోట్లు ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి సభలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘‘జయము జయము చంద్రన్నా.. జయము నీకు చంద్రన్నా..'' అంటూ టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ పోలవరం ప్రాజెక్ట్ వద్ద పాడిన పాట తాలూకు వీడియోను జగన్ సభలో ప్లే చేయించారు. ఆ వీడియోను చూస్తూ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు పడిపడి నవ్వారు.