ఈఎస్ఐ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని సీఐటీయూ ధర్నా

Feb 24, 2020, 5:50 PM IST

ఈఎస్ఐలో జరిగిన కుంభ కోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం విశాఖపట్నంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ.. రూ.152 కోట్ల రూపాయలను  రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2 లక్షల మంది కార్మికులకు ఉపయోగపడే ఈఎస్ఐని దోచుకోవటం సిగ్గుచేటు అని వారు విమర్శించారు. ఒక్క డిపార్ట్మెంట్ అని కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో జరిగే అవినీతిని బహిర్గతం చేయాలన్నారు. ఈ వ్యవహారంలో మంత్రులు సహా కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరున్నా కఠినంగా శిక్షించాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.