6,6,6,6.. ర‌జ‌త్ ప‌టిదార్ విధ్వంసం.. రికార్డు హాఫ్ సెంచ‌రీ న‌మోదు

Published : Apr 25, 2024, 09:33 PM IST
6,6,6,6.. ర‌జ‌త్ ప‌టిదార్ విధ్వంసం.. రికార్డు హాఫ్ సెంచ‌రీ న‌మోదు

సారాంశం

RCB vs SRH : ఐపీఎల్ 2024 లో రెండో సారి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రజత్ పటిదార్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ కొట్టాడు.   

IPL 2024 - Rajat Patidar : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్  2024 41వ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించగా, ర‌జ‌త్ పాటిదార్ తుఫాను బ్యాటింగ్ చేసి కేవలం 20 బంతుల్లో 50 పరుగులు కొట్టాడు.  కామెరాన్ గ్రీన్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరలో క్రీజులోకి వ‌చ్చిన ఇంఫాక్ట్ ప్లేయ‌ర్ స్వప్నిల్ సింగ్  12 పరుగులు చేసి అవుటయ్యాడు. కార్తీక్ బ్యాట్ నుంచి 11 పరుగులు వచ్చాయి. మిగతా బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. హైదరాబాద్ తరఫున జయదేవ్ ఉనద్కత్  మూడు వికెట్లు పడగొట్టాడు. టి నటరాజన్ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. పాట్ కమిన్స్, మయాంక్ మార్కండే  చెరో వికెట్ తీసుకున్నారు.

ర‌జ‌త్ పాటిదార్ విధ్వంసం.. 

ఈ మ్యాచ్ లో బెంగ‌ళూరు ప్లేయ‌ర్ ర‌జ‌త్ ప‌టిదారు బ్యాట్ తో దుమ్మురేపాడు. ఐపీఎల్ 2024 ఆరంభంలో ఇబ్బంది ప‌డిన ప‌టిదార్.. మ‌ళ్లీ ఫామ్ లోకి పుంజుకుని దుమ్మురేపుతున్నాడు. హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన షాట్స్ కొడుతూ రికార్డు హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 11వ ఓవర్‌లో రజత్ పాటిదార్ ధాటిగా బ్యాటింగ్ చేసి వ‌రుస‌గా 4 సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌ను వేసిన‌ మయాంక్ మార్కండే బౌలింగ్ చిత్తుచేశాడు. 50 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో ర‌జ‌త్ పటిదార్ 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. 51 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు.

అయ్యో.. మోహిత్ శ‌ర్మ ఎంత‌ప‌ని చేశావ్.. ట్రోలర్స్ ఆటాడుకుంటున్నారుగా.. !

 

 

జూనియర్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ తో మెరిసిన భారత ఆటగాళ్లు.. ఎన్ని పతకాలు సాధించారంటే..? 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !