జూనియర్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ తో మెరిసిన భారత ఆటగాళ్లు.. ఎన్ని పతకాలు సాధించారంటే..?

Published : Apr 25, 2024, 09:11 PM IST
జూనియర్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ తో మెరిసిన భారత ఆటగాళ్లు.. ఎన్ని పతకాలు సాధించారంటే..?

సారాంశం

Asian U20 Athletics Championships 2024 : దుబాయ్ లో జ‌రుగుతున్న జూనియర్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజింగ్ ఈవెంట్లో రణ్ వీర్ కుమార్ సింగ్, మ‌హిళ‌ల  కేట‌గిరిలో ఏక్తా ప్రదీప్ దే బంగారు ప‌త‌కాలు సాధించారు.   

Asian U20 Athletics Championships 2024: దుబాయ్ వేదికగా జరుగుతున్న జూనియర్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ప‌త‌కాలు గెలిచి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించారు. మహిళలతో పాటు పురుషుల విభాగంలో భారత్‌ పతకాలు సాధించింది. స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడినందుకు అభినందనలు తెలిపింది. భారత్ సాధించిన పతకాల్లో స్వర్ణాలు కూడా ఉన్నాయి.

3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఏక్తా స్వర్ణం

మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ ఈవెంట్‌లో ఏక్తా ప్రదీప్‌ దే 10:31.92 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

 

 

రణ్ వీర్ కుమార్ సింగ్ కు గోల్డ్.. 

దుబాయ్ లో జ‌రుగుతున్న జూనియర్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజింగ్ ఈవెంట్లో రణ్ వీర్ కుమార్ సింగ్ 9:22.67 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం సాధించాడు. 

 

 

షాట్‌పుట్‌లో అనురాగ్‌, సిద్ధార్థ్‌లకు ప‌త‌కాలు.. 

విదేశీ గడ్డపై దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన వారిలో అనురాగ్‌ సింగ్‌ కలేర్‌ పురుషుల షాట్‌పుట్‌లో 19.23 మీటర్లు వేసి బంగారు పతకం సాధించారు. పురుషుల షాట్‌పుట్‌లో సిద్ధార్థ్ చౌదరి 19.02 మీటర్ల రేంజ్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. విదేశీ గడ్డపై భార‌త‌ క్రీడాకారులు పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. 

 

 

ఆర్తికి క్యాంసం..

10000 మీటర్ల రేస్ వాక్‌లో ఆర్తి 47:45.33 సెకన్లలో పూర్తిచేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. దుబాయ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో, ఆర్తి ఆగస్టు 2024లో పెరూలోని లిమాలో జరగనున్న అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించారు.

 

 

దుబాయ్‌లో జరిగిన ఆసియా అండర్-20 మీట్‌లో ఉదయం జరిగిన డిస్కస్ త్రో పోటీలో అమానత్ డిస్కస్ త్రోలో రజతం సాధించాడు.  మహిళల డిస్కస్ త్రోలో అమానత్ రజత పతకం సాధించింది. భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.

 

అయ్యో.. మోహిత్ శ‌ర్మ ఎంత‌ప‌ని చేశావ్.. ట్రోలర్స్ ఆటాడుకుంటున్నారుగా.. ! 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !