RCB vs SRH : ఐపీఎల్ 2024 41వ మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. విరాట్ కోహ్లి (51 పరుగులు), రజత్ పటీదార్ (50 పరుగులు) బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించింది ఆర్సీబీ.
RCB vs SRH : :ఐపీఎల్ 2024 41వ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్ లో బెంగళూరు టీమ్ ప్రతీకారం తీర్చుకుంది. హైదరాబాద్ హీరోలు జీరో ఖాతాలతో పెవిలియన్ కు చేరడంతో హైదరాబాద్ టీమ్ కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి, రజత్ పటీదార్‌ల బ్యాట్ నుంచి అద్భుత హాఫ్ సెంచరీలు వచ్చాయి. దీంతో బెంగళూరు జట్టు స్కోరు 206 పరుగులకు చేరింది. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ ఫ్లాప్ షో తో హైదరాబాద్ టీమ్ కు షాక్ తగిలింది. ఆర్సీబీ జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గత మ్యాచ్‌లో బెంగళూరు తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో తలపడగా, హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసి చరిత్ర సృష్టించారు. హైదరాబాద్ 20 ఓవర్లలో 287 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఆర్సీబీ ఆటగాళ్లు 262 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌లో ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠగా ఉంటుందని భావించారు. కానీ, బెంగళూరు భారీ స్కోర్ చేయగా, హైదరాబాద్ అభిమానులను నిరాశపరిచింది. 11వ ఓవర్‌లో రజత్ పాటిదార్ ధాటిగా బ్యాటింగ్ చేసి వరుసగా 4 సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌ను వేసిన మయాంక్ మార్కండే బౌలింగ్ చిత్తుచేశాడు. 50 పరుగుల తన ఇన్నింగ్స్ లో రజత్ పటిదార్ 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. 51 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
రెండు జట్లలో ప్లేయింగ్-11
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమెరూన్ గ్రీన్, విల్ జాక్వెస్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
6,6,6,6.. రజత్ పటిదార్ విధ్వంసం.. రికార్డు హాఫ్ సెంచరీ నమోదు