విజయవాడలో చంద్రబాబు రోడ్ షో... వాహనంపై కూతురు, తండ్రి డుమ్మా

Mar 7, 2021, 2:57 PM IST

ఆదివారం చంద్రబాబునాయుడు విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడ భవానిపురం నుంచి చంద్రబాబు నాయుడు రోడ్ షో మొదలయ్యింది. ఈ ప్రచారంలో మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్  హాజరయ్యారు. కానీ  విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం హాజరు కాలేదు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచన మేరకే నాని ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారనే ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది.