Dec 16, 2019, 11:02 AM IST
రాష్ట్రంలో రివర్స్ పాలన, తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అనే అంశం పై తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. రివర్స్ టెండర్ కాదు, రిజర్వ్ టెండర్ అంటూ నేతలువెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేశారు.