నిండాముంచిన నకిలీ విత్తనాలు... గుంటూరులో బెండ రైతుల ఆందోళన

May 13, 2022, 2:41 PM IST

గుంటూరు: అన్నదాతలను నకిలీ విత్తనాల బెడద వెంటాడుతోంది. ప్రభుత్వాన్ని ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి క్యాష్ చేసుకునే కంపనీలు పుట్టుకొస్తూనే వున్నాయి. ఇలా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడి, కంఠంరాజు కొండూరు గ్రామంలో నకిలీ విత్తనాలతో బెండ రైతులు నిండా మునిగారు. కోస్టల్ హైబ్రిడ్ సంస్థ పంపిణీ  చేసిన నకిలీ బెండ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతుల ఆందోళన వ్యక్తం చేసారు. దాదాపు ఎకరాకి 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.