పొగమంచును చీల్చుకుంటూ కొండలమధ్యలోంచి సూర్యోదయం... ఏపీలో కాశ్మీర్ అందాలు

Jan 9, 2023, 2:02 PM IST

చింతపల్లి : మేఘాలు చేతికి తాకుతున్నాయా అన్నట్లుండే ఎత్తయిన కొండలు, నేలంతా పరుచుకున్న పచ్చని ప్రకృతితో ముందే ఆహ్లాదకరంగా వుంటుంది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం. ఈ అందాలకు పొగమంచు తోడవడంతో పర్యాటకులకు మరింత ఆకర్షిస్తోంది. ఎత్తయిన కొండల మధ్యలోంచి పొగమంచును చీల్చుకుంటూ దగదగా మెరిసిపోతూ సాగే సూర్యోదయం  పర్యాటకులను కట్టిపడేస్తోంది. అయితే ఈ అందాలు చూడాలంటే ఎముకలు కొరికే చలిలో కొండలపై ట్రెకింగ్ చేయాల్సిందే. చింతపల్లిలో గత ఆదివారం ఈ శీతాకాలంలోనే అత్యల్పంగా 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. దట్టమైన పొగమాంచుతో వాహనాల రాకపోకలకు కొన్నిగంటలపాటు తీవ్ర అంతరాయం కలిగింది. ఇలా మన్యంలో పర్యాటకులనే కాదు స్థానిక గిరిజనులను గజగజ వణికిస్తోంది చలిపులి.