AP PRC Issue:ఉద్యోగులు వెనక్కితగ్గినా... తగ్గేదేలే అంటున్న ఉపాధ్యాయ సంఘాలు

Feb 6, 2022, 11:37 AM IST

అమరావతి: మంత్రుల కమిటీలో జరిగిన చర్చలు సఫలీకృతమవడంతో సమ్మెను విరమిస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రకటించారు. అయితే పీఆర్సీ సాధన సమితి నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చర్చల్లో మంత్రుల కమిటీ కొన్నింటిపై సానుకూలంగా స్పందించినప్పటికి పీఆర్సీపై పునరాలోచన లేదని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీలో సభ్యులయిన ఏపీటీఎఫ్-1938 అధ్యక్షుడు హృదయ రాజు, ఎస్టీయూ అధ్యక్షుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. మంత్రుల కమిటీతో సమావేశంలో ఫిట్మెంట్ ను సవరించకపోవడం, రిటైర్డ్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఇవ్వకపోవడం , సీపిఎస్ పై స్పష్టత లేకపోవడం, ఇతర వేతన జీవులకు సంబంధించి స్పష్టత లేకపోవడం జరిగిందన్నారు.