ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కొత్త ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓబీసీ సామాజిక వర్గాల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను చర్చించారు.
లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ (మంగళవారం) ఉత్తరప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కొత్త ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత ఏడున్నర సంవత్సరాలుగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఓబీసీ సామాజిక వర్గాలు ఎలా లభ్దిపొందాయో ముఖ్యమంత్రి వివరించారు. ఓడీఓపీ, విశ్వకర్మ శ్రమ్ సమ్మాన్ వంటి పథకాలు ఓబీసీ సమాజం అభ్యున్నతికి కృషి చేసాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా, రిజర్వేషన్లు వంటి రాజ్యాంగ హక్కులైనా.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఓబీసీ సమాజం పూర్తిగా లబ్ధి పొందుతోందని ఆయన అన్నారు. కమిషన్ సభ్యులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల గురించి ప్రశంసలు దక్కుతున్నాయని అన్నారు. అక్కడ నుంచి వచ్చే అభిప్రాయాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేస్తున్నారు.
undefined
ఏవైనా కారణాల వల్ల కొందరికి ప్రభుత్వ పథకాలు అందకపోతే వారి తరపున కమిషన్ సిఫార్సు చేయాలని సూచించారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఓబీసీ యువతకు అత్యధిక ప్రాతినిధ్యం లభించిందని ముఖ్యమంత్రి అన్నారు.
కమిషన్ కార్యకలాపాలను మరింత ప్రజోపయోగ్యం చేయాలని ముఖ్యమంత్రి సమావేశంలో సూచించారు. ఓబీసీ సమాజాన్ని జాతీయవాదంలోకి తీసుకురావడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కమిషన్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. వెనుకబడిన తరగతుల యువతలో అపారమైన ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయని, వారికి తగిన వేదిక కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ దిశగా మెరుగైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కమిషన్‌ను యోగి కోరారు.
కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్‌తో సహా అందరు సభ్యులకు తగినన్ని గదులను కేటాయించాలని, కమిషన్ సజావుగా పనిచేయడానికి అవసరమైన అన్ని వనరులను అందించాలని సంబంధిత శాఖ అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు.