బాడ్మింటన్‌ స్టార్‌తో రామ్‌ గోపాల్‌ వర్మ మేనకోడలు పెళ్లి, స్పెషాలిటీ ఏంటో తెలుసా?

First Published | Sep 25, 2024, 12:20 AM IST

రామ్‌ గోపాల్‌ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి.. ప్రముఖ బాడ్మింటన్‌ స్టార్‌తో జరగబోతుంది. అయితే ఈ పెళ్లి ఒక విషయంలో చాలా ప్రత్యేకంగా నిలవబోతుంది. 
 

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. బోల్డ్ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. భార్యా పిల్లలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఆయన ఫ్యామిలీని దూరం పెట్టినా, ఆయనకంటూ బంధువులున్నారు. తాజాగా ఆయన మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి కాబోతుంది. ఇదే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతుంది. శ్రావ్య వర్మ పెళ్లి ప్రముఖ బాడ్మింటన్‌ స్టార్‌ శ్రీకాంత్‌ కిదాంబితో జరగబోతుండటం విశేషం. శ్రావ్య వర్మ స్టయిలీస్ట్ అనే విషయం తెలిసిందే. వర్మతో పని చేసింది కూడా.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

త్వరలోనే శ్రావ్య వర్మ, శ్రీకాంత్‌ కిదాంబి వివాహం జరగనుంది. దీనికి సంబంధించి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో వీరి మ్యారేజ్‌లో ఓ స్పెషాలిటీ ఉండబోతుంది. పెళ్లి షాపింగ్‌ అంతా గౌరీ సిగ్నేచర్‌ స్టోర్‌లో జరగబోతుండటం విశేషం. ఇటీవల కాలంలో ఇది చాలా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు.

సెలబ్రిటీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా  నిలుస్తుంది. ప్రముఖుల డిజైన్స్ ఇందులో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. ముఖ్యంగా వధువరుల పెళ్లి దుస్తులు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీకాంత్‌ కిదాంబి, శ్రావ్య వర్మ తమ పెళ్లి కోసం దీన్ని ఎంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ పెళ్లి షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. 
 


దీని గురించి మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఉద‌య్ సాయి మాట్లాడుతూ, తమది స్వతహాగా వీవర్స్ కమ్యూనిటీ అనీ , వారి తండ్రి కౌతవరపు శ్రీనివాసరావు కి ఈ రంగం లో ఉన్న అనుభవమే ప్రీమియ‌మ్ వెడ్డింగ్  క‌లెక్ష‌న్స్ లో టాప్ గా నిలవటానికి కారణమన్నారు. శ్రీకాంత్ కిదాంబి , శ్రావ్య వ‌ర్మ లు మా స్టోర్స్ కి రావ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

సెలబ్రిటీస్ కి మాత్రమే అందరికీ అందుబాటు బడ్జెట్ లలో  డిజైనర్  దుస్తులు అందిస్తామన్నారు. ఈ జనరేషన్‌ మ్యారేజ్‌కి ఎంతో ప్రయారిటీని ఇస్తుంది. ఆ పెళ్లి ఎంతో స్పెషల్‌గా ఉండాలని చూస్తున్నారు. ఏ విషయంలోనూ రాజీపడటం లేదు.  వారి కోరిక‌ల‌కు, అభిరుచిల‌కు త‌గిన విధంగా వివాహా వ‌స్త్రాల‌ను మ‌రింత ప్ర‌త్యేకంగా డిజైన్ చేస్తూ వారి వివాహాంలో ముఖ్య‌ పాత్ర‌ను పోషిస్తుంది గౌరి సిగ్నేచర్స్.
 

గౌరి సిగ్నేచర్స్ లో భాగమైన U&G పెళ్లి వస్త్రాలను డిజైన్ చేయటం లో తమ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాయి. త్వ‌రలో పెళ్ళి కానున్న బ్యాడ్మెంట‌న్ ప్లేయ‌ర్ శ్రీకాంత్ కిదాం బి, స్టైలిస్ట్ శ్రావ్యవ‌ర్మ సిగ్నేచ‌ర్ స్టూడియో లో త‌మ వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌ వేడుక‌కు సంబంధించిన డిజైన్స్ ను ప్ర‌త్యేకంగా అందిస్తున్నాం.

అద్భుతమైన చీరలను గౌరి సిగ్నేచర్స్ అందిస్తే, కుటుంబంలో అంద‌రికీ హల్ది, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలకు వారి అభిరుచి కి త‌గిన విధంగా కస్టమైజేషన్ చేయటం లో U&G ముందుంది. కాంజీవ‌రం శారీస్ అంటేనే వివాహా వేడుక‌ల్లో ప్ర‌త్యేక స్థానంలో నిలుస్తాయి. కాంజీవ‌రం శారీస్ ని అందించ‌డంలో గౌరీసిగ్నేచ‌ర్స్ త‌మ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల‌నుండి నేత ప‌రిశ్ర‌మ‌లు గౌరీ సిగ్నేచ‌ర్స్ కి వెన్నెముక గా నిలుస్తున్నాయ`న్నారు. 
 

Latest Videos

click me!