విడాకులకు అప్లై చేసిన 'రంగీలా' ఊర్మిళ

First Published Sep 25, 2024, 6:43 AM IST

 విడాకుల కోసం ముంబయి కోర్టులో  పిటిషన్‌ దాఖలు చేసినట్లు నేషనల్  మీడియా వెల్లడించింది. అయితే ఊర్మిళ నుంచి అధికారిక సమాచారం రాలేదు. 
 


రంగీలా, సత్య, అనగనగా ఒక రోజు, గాయం చిత్రాలతో తెలుగు,హిందీ భాషల్లో తనకంటూ ఓ స్దానం ఏర్పాటు చేసుకున్న ఈ మరాఠి బ్యూటి ఇలా బ్రహ్మచారిణిగానే ఉండిపోతుందని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందలు చేస్తూ  మేసిన్ అక్తర్ మిర్ ని వివాహం చేసుకుంది.  

గతంలో మోడల్ గా చేసి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సెటిలైన్ వ్యక్తి. కాస్త లేటైనా ఓ ఇంటిది అయ్యింది. అయితే ఇదంతా ఎనిమిదేళ్ల క్రితం మాట.  ఊర్మిళ మతోంద్కర్‌ విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం.  


 ఊర్మిళ మతోంద్కర్‌ (Urmila Matondkar) విడాకులు తీసుకోనున్నట్లు  తెలుస్తోంది. తన భర్త మోసిన్‌ అక్తార్‌ మిర్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడాకుల కోసం ముంబయి కోర్టులో నాలుగు నెలల క్రితం పిటిషన్‌ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఊర్మిళ నుంచి అధికారిక సమాచారం రాలేదు. 

Latest Videos



ఎనిమిదేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త, మోడల్‌ మోసిన్‌ అక్తార్‌ను వివాహమాడారు. అయితే ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని, ఊర్మిళనే కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఏ కారణం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియరాలేదు.  

2014లో ప్రముఖ బాలీవుడ్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా మేనకోడలు పెళ్లిలో ఊర్మిళ, మోసిన్ పరిచయం అయినట్లు సమాచారం. అనంతరం కొద్దిరోజుల్లోనే వీరి మనసులు కలవడంతో ఫిబ్రవరి 4, 2016లో బంధువులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది.  మోసిన్‌ కంటే ఊర్మిళ వయసులో 10 ఏళ్లు పెద్ద. 


 ఊర్మిళ మతోండ్కర్ మూడేళ్ల వయసులో బాల నటిగా వెండితెరకు పరిచయమై, 90వ దశంలో స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో రాణించింది. ముంబైకి చెందిన ఊర్మిళ 1977లో విడుదలైన ‘కర్మ’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. అప్పుడు ఆమె వయసు మూడేళ్లు.

ఆ తరువాత 1983లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మసూమ్’‌లో బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ ఈ సినిమాలో నటించారు. 1991లో రిలీజ్ అయిన ‘నర్సింహ’ చిత్రంలో ఊర్మిళ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.


రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1995లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘రంగీలా’లో హీరోయిన్‌గా ఊర్మిళకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్‌తో ఓవర్ నైట్‌లో సెక్సియస్ట్ హీరోయిన్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది.

సినిమాలోని ‘రంగీలారే’ సాంగ్ దేశాన్ని ఒక ఊపు ఊపింది.  రంగీలా తరువాత జుదాయి, సత్య, ఖూబ్‌సూరత్ వంటి హిట్‌ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించింది. దీంతో కొన్నేళ్ల పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఊర్మిళ కొనసాగింది.
 


2003లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘భూత్‌’లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. అంతం (1992), గాయం (1993), భారతీయుడు (1996), అనగనగా ఒక రోజు (1997) వంటి సినిమాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
 


ఊర్మిళ నటించిన రంగీలా సినిమాలోని ‘రంగీలా రే’ అనే పాట అప్పట్లో సెన్సేషన్. ఈ పాటలో ఊర్మిళ డ్యాన్స్ కుర్రకారును ఉర్రుతలూగించింది. ఈ పాటతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఊర్మిళ 2008 నుంచి 2022 వరకు ఝలక్ దిఖ్లా జా, డ్యాన్స్ మహారాష్ట్ర డ్యాన్స్, డీఐడీ సూపర్ మామ్స్ వంటి ప్రముఖ టెలివిజన్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 
 

 సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన ఊర్మిళ.. 2019లో కాంగ్రెస్‌లో చేరారు. అదే సంవత్సరం ముంబయి నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2020లో ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరారు.ఇక 21 ఏళ్ల వయసులో సినిమా అవకాశాల కోసం మోసిన్‌ అక్తార్‌ కశ్మీర్‌ నుంచి ముంబయికి వచ్చారు. అనంతరం పలు సినిమాల్లో పాత్రలు దక్కించుకున్నారు.       
 

click me!