వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న సుధీర్ బాబు హీరోగా ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ రూపొందుతుంది. అనౌన్స్‌మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతుంది.
ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.