AP PRC Protest:జగన్ సర్కార్ కు ఉద్యోగుల రివర్స్ పంచ్...

Feb 4, 2022, 4:42 PM IST

అమరావతి: ఏపీ ఉద్యోగులు ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ నిరసనల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఛలో విజయవాడ పేరిట భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవతంగా పూర్తిచేసిన ఉద్యోగులు ఇవాళ(శుక్రవారం) వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తూ పెన్ డౌన్ చేసిన సచివాలయ ఉద్యోగులు విసూత్న రీతిలో నిరసన చేపట్టారు. రివర్స్ పిఆర్సీ జివోలు మాకు వద్దని నినాదాలు చేస్తూ సెక్రెటేరియట్ ప్రాంగణంలో రివర్స్ లో నడుస్తూ ర్యాలీ నిర్వహించారు ఉద్యోగులు. ప్రభుత్వం దిగిరాకుంటే 7వ తేది నుండి సమ్మెలోనికి వెడతామని సెక్రటేరియట్ ఉద్యోగులు హెచ్చరించారు.