చివరకు సీఎం జగన్ తెలుసన్నా నమ్మొద్దు...: హోంమంత్రి వనిత కీలక వ్యాఖ్యలు

Feb 12, 2023, 11:28 AM IST

కొవ్వూరు : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చేపడుతోందని... అభ్యర్థులెవ్వరూ అపోహలకు గురికావద్దని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసేవారిని నమ్మవద్దని... మాయమాటలతో మోసపోవద్దని మంత్రి సూచించారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా చాలా పారదర్శకంగా జరిగిందని... ప్రతిభ, మెరిట్ కలిగిన అభ్యర్థులే ఉద్యోగాలను పొందుతారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో 6100 కానిస్టేబుల్స్ ఉద్యోగుల భర్తీ ఎలాంటి అపోహలకు తావులేకుండా సజావుగా సాగుతుందని హోంమంత్రి వనిత స్ఫష్టం చేసారు.