పార్టీ ఏదైనా... మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించబోం...: హోంమంత్రి సుచరిత వార్నింగ్

Jan 31, 2022, 5:33 PM IST

అమరావతి: మహిళల రక్షణ విషయంలో వైసిపి ప్రభుత్వం నిబద్దతతో చర్యలు తీసుకుంటోందని... నిందితులతో చాలా కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.  రాష్ట్రంలో అసలు నేరాలే జరగటంలేదని తాము చెప్పడం లేదని... కానీ నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో... నిందితులను ఎంత కఠినంగా శిక్షిస్తుందో చూడాలని అంటున్నామన్నారు. పార్టీ ఏదైనా సరే... మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించే ప్రభుత్వం తమది కాదన్నారు హోంమంత్రి సుచరిత.  ''గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశాం. విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసిన వినోద్ జైన్ పైనా కఠినంగా వ్యవహరిస్తాం.  లోకేష్ పీఏ మహిళల్ని వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఇందోలోనూ కఠినంగానే వుంటాం'' అని సుచరిత హెచ్చరించారు.