Dec 12, 2019, 6:05 PM IST
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019 బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన ఆంధప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహిళా బిల్లును తెచ్చినందుకు వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం జగన్ కు రాఖీ కట్టారు.