Nov 21, 2019, 2:46 PM IST
విజయవాడలోని నగరాల సీతారామస్వామి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం కేంద్ర కార్యాలయ భవనం రెండో అంతస్తును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నగరాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీలో నగరాల కులాన్ని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని తాను స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చానని చెప్పారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో దీనిపై జీవో కూడా ఇస్తారని హామీ ఇచ్చారు.