Aug 4, 2020, 1:18 PM IST
అమరావతి, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును ఆశ్రయించింది. దీనిమీద నేడు విచారణ ఉండడంతో సీడ్ యాక్సెస్ రోడ్డు కి ఇరువైపుల వెంకటపాలెం,ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు కు చెందిన రైతులు, రైతు కూలీలు నిలబడి నిరసన తెలిపారు.న్యాయమూర్తులు, న్యాయవాదులు అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నిన్న దీక్షా శిబిరాల్లో తుళ్లూరు మహిళా రైతులు హైకోర్టు కు ప్రత్యేక పూజలు చేశారు.