Oct 15, 2022, 12:20 PM IST
విశాఖ గర్జనకు సర్వం సిద్ధమయ్యింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని కోసం ఐకాస తలపెట్టిన ఈ కార్యక్రమానికి అధికార వైసీపీ పూర్తి మద్ధతు తెలిపింది. అమరావతి రైతులు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న నేతలు, విశాఖ గర్జన ద్వారా ఈ ప్రాంత ప్రజల మనోబావాలను గట్టిగా చాటి చెబుతామని స్పష్టం చేశారు. గర్జన నేపథ్యంలో అనేక చోట్ల పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.