జానీ మాస్టర్ వివాదం, అల్లు అర్జున్ పై దుష్ప్రచారం చేస్తుంది వాళ్లే, సంచలనంగా పుష్ప నిర్మాత కామెంట్స్ 

First Published | Sep 23, 2024, 3:18 PM IST

లేడీ కొరియోగ్రాఫర్ వెనకుండి జానీ మాస్టర్ ని ఇరికించింది అల్లు అర్జున్, సుకుమార్ అంటూ ఆరోపణలు వస్తుండగా.. పుష్ప నిర్మాత రవి శంకర్ యెర్నేని స్పందించారు. అల్లు అర్జున్ పై దుష్ప్రచారం చేస్తుంది వాళ్లే... అంటూ కీలక కామెంట్స్ చేశాడు. 
 

Jani Master

జానీ మాస్టర్ పై 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. నన్ను అసిస్టెంట్ గా నియమించుకున్న జానీ మాస్టర్.. ముంబైలోని హోటల్ లో మొదటిసారి లైంగిక దాడి చేశాడు. అప్పటికి నా వయసు 16 ఏళ్ళు. ఈ విషయం బయట చెబితే కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించాడు.

Jani Master

నాలుగేళ్ళ పాటు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. జానీ మాస్టర్ కి ఆయన భార్య అయేషా మద్దతు పలికింది. ఆమె కూడా ఫిజికల్ గా నాపై అటాక్ చేసింది.. అంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన జానీ మాస్టర్ పై పోక్సో(POCSO) కేసు నమోదైంది. 

అలాగే పలు సెక్షన్స్ జానీ మాస్టర్ పై పోలీసులు ఫైల్ చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ గోవాలో పోలీసులకు దొరికాడు. హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్ట్ జానీ మాస్టర్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలను జానీ మాస్టర్ భార్య అయేషా(సుమలత) ఖండించింది. ఆమె నేరుగా అల్లు అర్జున్,సుకుమార్ లపై ఆరోపణలు చేసింది. 


Jani Master controversy

లేడీ కొరియోగ్రాఫర్ కి మద్దతు తెలిపిన అల్లు అర్జున్, సుకుమార్ తనకు కూడా న్యాయం చేయాలని, తాను కూడా బాధితురాలినే అని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అల్లు అర్జున్, సుకుమార్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

లేడీ కొరియోగ్రాఫర్ ద్వారా జానీ మాస్టర్ కి అల్లు అర్జున్ చెక్ పెట్టాడని వస్తున్న వార్తలపై పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ యెర్నేని స్పందించారు. ఈ మేరకు ఆయన కీలక కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ వివాదంతో అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. 
 

Jani Master

జానీ మాస్టర్-లేడీ కొరియోగ్రాఫర్ వివాదం పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ ఇష్యూ. దాంతో అల్లు అర్జున్ కి సంబంధం లేదు. సెట్స్ లో ఏం జరుగుతుందో అల్లు అర్జున్ కి తెలియదు. డాన్సర్స్ ఎదురై విష్ చేస్తే తిరిగి విష్ చేస్తారు. అంతకు మించి వారితో ఎలాంటి వ్యక్తిగత అనుబంధం ఉండదు. 

పుష్ప 2 సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్ గా  ఆ లేడీ డాన్సర్ ను పెట్టుకున్నాము. ఆరు నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఆ డాన్సర్ పేరు ఉంది. మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. జానీ మాస్టర్ తో రెండు రోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపు ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది 
 

Jani Master controversy

పేరున్న మీడియా సంస్థ లేవి నిరాధార కథనాలు రాయడం లేదు. వారు బాధ్యతగానే వ్యవహరిస్తున్నారు.కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్  వాళ్ళ ఉనికి కోసం ఇలా అలజడి సృష్టిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇమేజ్ దెబ్బ తీసేలా కథనాలు రాస్తున్నాయి. అల్లు అర్జున్ స్టేచర్ కి జానీ మాస్టర్ వంటి ఒక కొరియోగ్రాఫర్ మీ కుట్ర చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది.  

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

జానీ మాస్టర్ - లేడీ డాన్సర్ మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం. అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు.. అన్నారు. పుష్ప మూవీ సెట్స్ లో జానీ మాస్టర్ ఆమెపై దురుసుగా ప్రవర్తించాడనే వాదన ఉంది. అలాగే విశ్వక్ సేన్ మూవీకి ఆమె పని చేస్తుండగా.. అక్కడకు కూడా వెళ్లి గొడవ చేశాడని కథనాలు ప్రసారం అయ్యాయి. 

Latest Videos

click me!