మనం ఎంత వద్దు అనుకున్నా... వయసు పెరుగుతూనే ఉంటుంది. వయసు పెరుగుతుంటే... ముఖంలోని కళ తప్పిపోవడం మొదలౌతుంది. ఇక ఆరోగ్య సమస్యల గురించి అయితే.. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేనా.. వృద్ధాప్యం మన మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ప్రభావితం చేస్తుంది. మన వయసు పెరుగుతోంది అని మన బాడీ గుర్తించేలోగా... ముఖంపై ఆ ఛాయలు స్పష్టంగా కనపడటం మొదలుపెడతాయి. తెల్ల జుట్టు రావడం, ముఖంపై ముడతలు రావడం లాంటివి జరుగుతాయి. కానీ... ఇలా వయసు మీద పడటం ఎవరికీ నచ్చదు. ముఖ్యంగా స్త్రీలు.. తాము ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలని ఆశపడుతూ ఉంటారు. ఆ పెరుగుతున్న వయసును కవర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే నూనెలు, క్రీములు, కాస్మటిక్స్ అన్నీ పూయడం మొదలుపెడతారు. అయితే... నిజంగా 35 దాటిన తర్వాత కూడా అందంగా కనిపించాలనే కోరిక ఉంటే.. కొన్ని పనులు అస్సలు చేయకూడదట. మరి.. ఏం చేయకూడదు..? ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుంటే... ఏజ్ పెరిగినా కూడా అందంగా కనిపించవచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం....
35 దాటింది అంటే... కచ్చితంగా స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. ఈ ఏజ్ రాగానే.. మనకు తెలీకుండానే చాలా వేగంగా మనం వయసు పెరిగినట్లు కనపడటం మొదలౌతుంది. అయితే.. ఆ ఏజ్ పెరగకుండా ఆపే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. దానికోసం కచ్చితంగా నాలుగు పనులు చేయడం అలవాటు చేసుకోవాలట. మరి.. అవేంటో ఓసారి చూద్దాం...
1.రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటం..
మీరు చదివింది నిజమే. మీరు ఎక్కువ కాలం అందంగా కనిపించాలి అంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి. మీ వయస్సు కంటే యవ్వనంగా కనిపించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, వృద్ధాప్య సంకేతాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే, మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్‌గా ఉన్నప్పుడు వృద్ధాప్యం వేగంగా జరుగుతుంది. దీనితో పాటు, శరీరంలో టాక్సిన్స్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది వేగంగా వృద్ధాప్యానికి దారితీస్తుంది. అందువల్ల, 35 సంవత్సరాల తర్వాత తక్కువ స్వీట్లు తినండి. ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
పేగు ఆరోగ్యం...
పేలవమైన పేగు ఆరోగ్యం కూడా ముందస్తు వృద్ధాప్యానికి కారణం. పేలవమైన పేగు ఆరోగ్యం అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. అంటే.. మనం తీసుకునే ఆహారం అరగకపోవడం లాంటి సమస్యలు ఉండకూడదు. జీర్ణ వ్యవస్థ బాగా పని చేయాలి. గట్ మైక్రోబయోమ్ కారణంగా, సూక్ష్మపోషకాల జీర్ణక్రియ, శోషణ ప్రభావితమవుతుంది. పెరుగుతున్న వయస్సుతో, పేగు ఆరోగ్యం ప్రభావితమవుతుంది. ఈ విషయంల శ్రద్ధ చూపించకపోతే.. మళ్లీ ఆ ప్రభావం మీ చర్మంపై పడే అవకాశం ఉంటుంది.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం..
శరీరంలో నీరు లేకపోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బాడీ హైడ్రేటెడ్ గా లేనప్పుడు..స్కిన్ సాగిపోయినట్లుగా మారుతుంది. ముఖం పై ముడతలు వస్తాయి. అదే.. మంచినీరు ఎక్కువగా తాగి.. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే.. ముఖంపై తొందరగా ముడతలు రాకుండాఉంటాయి. మరోవైపు, మీరు తగినంత నీరు త్రాగకపోతే, అది మొటిమలకు కారణమవుతుంది. వయసుకు మంచి కనిపిస్తారు. అందుకే.. మంచినీరు తాగుతూ ఉండాలి.
ఉపవాసం..
రెగ్యులర్ గా రోజులో 12 నుంచి 14 గంటలపాటు ఉపవాసం ఉండాలి. ఆ సమయంలో ఏమీ తినకుండా ఉండాలి. తరచుగా ప్రజలు 12-14 గంటలు ఉపవాసం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ, ఇది అలా కాదు. దీని వల్ల శరీరం టాక్సిన్ ఫ్రీ అవుతుంది. అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి వృద్ధాప్య సంకేతాలు త్వరగా కనిపించవు. ఎక్కువ కాలం.. యవ్వనంగా కనిపిస్తారు.