ఒక్కటి తప్ప అన్నింటిలో చిరంజీవికి పోటీ ఇచ్చిన ఏకైక హీరో..అనుకోకుండా ఇద్దరి మధ్య కాంపిటీషన్

First Published | Sep 23, 2024, 3:20 PM IST

మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ 45 ఏళ్లుగా కొనసాగుతున్న తిరుగులేని కెరీర్ గుర్తుకు వస్తుంది. చిరంజీవి అంటే నటన, ఫైట్స్ తో పాటు ఆయన చేసిన డ్యాన్సులు కూడా గుర్తుకు వస్తాయి.

Chiranjeevi Konidela

మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ 45 ఏళ్లుగా కొనసాగుతున్న తిరుగులేని కెరీర్ గుర్తుకు వస్తుంది. చిరంజీవి అంటే నటన, ఫైట్స్ తో పాటు ఆయన చేసిన డ్యాన్సులు కూడా గుర్తుకు వస్తాయి. రీసెంట్ గా చిరంజీవి తన డ్యాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా అందుకున్నారు. 1979లో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 

తన ప్రతిభతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి తర్వాత కొంతమంది స్టార్ హీరోలు వచ్చారు కానీ.. ఆయన రేంజ్ ని అందుకోలేకపోయారు. అయితే చిరంజీవికి కెరీర్ బిగినింగ్ లో గట్టి పోటీ ఇచ్చిన హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. సుమన్. తన వ్యక్తిగత జీవితం వివాదం కారణంగా సుమన్ జైలుకి వెల్ళడంతో కెరీర్ లో వెనుకబడిపోయారు. 

Latest Videos


అయితే కెరీర్ బిగినింగ్ లో చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వడం గురించి సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. చిరంజీవి కి పోటీగా వెళ్లాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని తెలిపారు. ఒక సమయంలో నేను మెగాస్టార్ ని అయ్యాను.. నువ్వు కావలసింది అని చిరంజీవి మీతో అన్నట్లు తెలిసింది నిజామా అని యాంకర్ ప్రశ్నించింది. 

actor suman

దీనికి సుమన్ బదులిస్తూ.. నాతో ఎప్పుడూ అలా అనలేదు. నేను చిరంజీవికి కాంపిటీషన్ అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కాయాన్ని తెలియకుండానే చిరంజీవికి కాంపిటీషన్ అయ్యాను. అప్పట్లో ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. అప్పుడు చిరంజీవి ఎదుగుతున్నారు. ఫైట్స్, నటన చాలా బాగా చేస్తున్నాడు. దీనితో చిరంజీవికి కొత్త తరం హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. 

kollywood actor suman

చిరంజీవితో పాటు నేను కూడా ఫైట్స్, యాక్టింగ్ చేస్తున్నాను. కానీ చిరంజీవి మంచి డ్యాన్సర్. దీనితో చిరంజీవికి ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది డ్యాన్సర్లు వచ్చి ఉండొచ్చు. కానీ నేల చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది చిరంజీవి ఒక్కరే అని సుమన్ అన్నారు. 

అప్పట్లో కొన్ని నేను నాటించి కొన్ని చిత్రాలకు చిరంజీవి సినిమాలతో పోటీగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ నేనెప్పుడూ చిరంజీవికి కాంపిటీషన్ అని అనుకోలేదు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి రావడమే గొప్ప విషయం. ఇంత సాధించడం ఇంకా గొప్ప విషయం అని సుమన్ తెలిపారు. 

click me!