వామ్మో మహేష్‌ ఏంటి ఇలా ఉన్నాడు? ఈ లుక్‌ కే బాక్సాఫీసు షేక్‌ అయిపోవాల్సిందే?

First Published | Sep 23, 2024, 2:57 PM IST

మహేష్‌ బాబు కొత్త లుక్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతుంది. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా కనిపించలేదు ఇదే ఇప్పుడు గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. 
 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేయబోయే సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాని రూపొందించడమే కాదు, ఎలా ప్రమోట్‌ చేయాలి, ఎక్కువ ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు ఏ సినిమాకి చూడని విధంగా అత్యధిక ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించాలనే యాంగిల్‌లో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

Rajamouli and Mahesh Babu

`ఎస్‌ఎస్‌ఎంబీ 29` పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు రాజమౌళి. కాస్టింగ్‌ ఎంపిక, టెక్నీషియన్లు ఎంపిక, అలాగే లొకేషన్లు, షాట్‌ డివిజన్‌, బడ్జెట్‌ ఇలా అన్నింటిపై ఆయన వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ వైపు ఇది జరుగుతుంది. మరోవైపు మహేష్‌ బాబు మేకోవర్‌ అవుతూ బిజీగా ఉన్నారు. ఆయన ఈ సినిమా కోసం ప్రత్యేకమైన వర్కౌట్స్ చేస్తున్నారు. సరికొత్త మేకవర్‌లోకి మారిపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన బాడీ పరంగానే కాదు, లుక్‌ వైజ్‌గానే చాలా మారిపోతున్నారు. 
 


తాజాగా మహేష్‌ బాబు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. సతీసమేతంగా నమ్రతతో కలిసి సీఎంని కలిశారు మహేష్‌. ఇటీవల ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా, భారీ వరదలకు చాలా ప్రాంతాలు నీటమునిగాయి. చాలా మంది ఇళ్లని కోల్పోయారు. భారీగా నష్టం ఏర్పడిన నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినిమా సెలబ్రిటీలు కూడా స్పందించి తమ వంతు విరాళాలు ప్రకటించారు. అందులో భాగంగా మహేష్‌ తెలంగాణకి యాభై లక్షలు, ఏపీకి యాభై లక్షల విరాళం ప్రకటించిన నేపథ్యంలో తాజాగా సోమవారం సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి యాభై లక్షల చెక్కుని అందజేశారు. 
 

ఈ సందర్భంగా మహేష్‌ నయా లుక్‌లో దర్శనమిస్తున్నారు. గెడ్డంతో, పెరిగిన మీసాలతో, పెరిగిన జుట్టుతో కనిపిస్తున్నారు. మహేష్‌ ని ఇలా చూడటం రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. సడెన్‌గా చూస్తే అసలు ఇదే మహేష్‌ బాబేనా అని ఆశ్చర్యపోయేలా ఆయన లుక్‌ ఉండటం విశేషం.

ఇది ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషి చేస్తుంది. రాజమౌళి గట్టిగానే ఏదో వండుతున్నాడనే అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ సినిమాపై భారీగా హోప్ప్ పెట్టుకుంటున్నారు. ఇంకా ప్రారంభం కానీ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు మహేష్‌ బాబు నయా లుక్‌ని చూస్తే ఆ అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. 
 

అంతేకాదు దీనిపై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తూ సూపర్‌ స్టార్‌ లుక్కే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని, లుక్‌కే బాక్సాఫీసు షేక్‌ అయిపోవాల్సిందే అని అంటున్నారు. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతుంది. మహేష్‌ ఫ్యాన్స్ అప్పుడే కలర్‌ ఎగరేస్తున్నారు.

భారీగా ఈ లుక్‌ని వైరల్‌ చేస్తున్నారు. 18వ శతాబ్దానికి చెందిన హిస్టారికల్‌ స్టోరీతో ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారట. ఇందులో ప్రపంచ సాహసికుడిగా మహేష్‌ కనిపిస్తారని, డీ గ్లామర్ లుక్‌లో ఆయన దర్శనమిస్తారని, ప్రస్తుతం మహేష్‌ లుక్‌ ఈ మూవీకోసమే అని తెలుస్తుంది.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు సినీ లవర్స్ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!