Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్‌లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

vanteru pratap reddy likely to join in trs on jan 18
Author
Gajwel, First Published Jan 17, 2019, 4:14 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్‌లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  ఒంటేరు ప్రతాప్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.2009 ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి ఈ స్థానం నుండి మహాకూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

గత ఏడాది క్రితం ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ప్రతాప్ రెడ్డిని టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ ఆహ్వానించారు. కానీ, ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరలేదు. టీడీపీలోనే కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే ముందు కూడ ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని మరోసారి ఆహ్వానించినా కూడ ప్రతాప్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. 

గజ్వేల్ నియోజకవర్గంలో తన అనుచరులతో ప్రతాప్ రెడ్డి భేటీ అయ్యారు. టీఆర్ఎస్‌లో చేరిక విషయమై ప్రతాప్ రెడ్డి చర్చిస్తున్నారని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios