టీఆర్ఎస్‌లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి

Published : Jan 18, 2019, 05:21 PM ISTUpdated : Jan 18, 2019, 05:25 PM IST
టీఆర్ఎస్‌లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి

సారాంశం

: కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ సమక్షంలో  టీఆర్ఎస్ లో చేరారు. 


హైదరాబాద్: కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ సమక్షంలో  టీఆర్ఎస్ లో చేరారు. తన అనుచరులతో కలిసి ప్రతాప్ రెడ్డి  టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.నాలుగేళ్లుగా రాషట్రంలో  టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌కు ఓట్లు వేశారని ఆయన చెప్పారు.

తాను కొండ పోచమ్మ సాగర్, మల్లన్నసాగర్  ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నిర్వాసితుల తరపున పోరాటం చేసినా కూడ ప్రజలు   పెద్ద ఎత్తున కేసీఆర్‌కే ఓట్లు వేశారని చెప్పారు. 2009, 2014, 2018 ఎన్నికల సమయంలో  తనను టీఆర్ఎస్ లో చేరాలని కోరినా కూడ  చేరలేదన్నారు. గతంలోనే టీఆర్ఎస్‌లో చేరితే తాను లబ్ది పొందేవాడినని చెప్పారు.గజ్వేల్ నుండి  ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలనే ఉద్దేశ్యంతోనే తాను పోరాటం చేసినట్టు  ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?