హైదరాబాద్ టెస్ట్‌కు భారీ భద్రత.. ఫ్యాన్స్‌పై ఆంక్షలు: సీపీ

By sivanagaprasad kodatiFirst Published Oct 9, 2018, 1:54 PM IST
Highlights

ఈ నెల 12 నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. 

ఈ నెల 12 నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

ఇవాళ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 15 మంది సిబ్బందితో పాటు.. స్టేడియం పరిసరాల్లో 100 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు సీపీ వెల్లడించారు. వీటికి అదనంగా స్టేడియం మేనేజ్‌మెంట్ కూడా ప్రత్యేకంగా భద్రతను పర్యవేక్షిస్తుందని భగవత్ తెలిపారు.

ఈ సందర్భంగా అభిమానులపై కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్లుగా కమిషనర్ వెల్లడించారు. లాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాయిన్స్, హెల్మెట్లు, లైటర్లు, పర్ఫ్యూమ్ బాటిళ్లు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, తినుబండారాలను స్టేడియం లోపలికి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు.

అయితే భద్రతా అధికారుల సూచనలు పాటిస్తూ సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లవచ్చన్నారు.. మహిళా అభిమానుల కోసం అందుబాటులో షీ టీం ఉంటుందని.. పార్కింగ్ కోసం 16 స్థలాలను ఏర్పాటు చేసినట్లు మహేశ్ భగవత్ తెలిపారు.

వెస్టిండిస్‌కు మరో ఎదురుదెబ్బ...వన్డే,టీ20 సీరిస్‌లకు గేల్ దూరం

ధోనీ, గంగూలీ రికార్డులను బద్దలుగొట్టిన కోహ్లీ...అజారుద్దిన్ తర్వాత అతడే...

ఓవర్ యాక్షన్ తో టెన్షన్ లో పెట్టిన జడేజా: కోహ్లీ మందలింపు

బ్రాడ్ మెన్ తర్వాత కోహ్లీనే...స్మిత్‌ను వెనక్కి నెట్టి...

అరంగేట్రంలో పృథ్వీ షా సెంచరీ.. అప్పుడే అంతొద్దన్న గంగూలీ

రాజ్ కోట్ టెస్ట్‌లో చేతులెత్తేసిని విండీస్: భారత్ ఘనవిజయం

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

click me!