భర్తను చంపేసి.. ప్రియుడి ఇంటి ముందు దీక్ష..

Published : Oct 09, 2018, 01:39 PM IST
భర్తను చంపేసి.. ప్రియుడి ఇంటి ముందు దీక్ష..

సారాంశం

కామంతో కళ్లు మూసుకుపోయిన వేళ ప్రియుడి మాయ మాటలతో ఏకంగా తన భర్తనే అంతమొందించాలని  నిర్ణయించుకుంది. 


వివాహేతర సంబంధాలు జీవితాన్ని ఎంతలా కుదేలు చేస్తాయో.. చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ప్రియుడి మోజులో పడి.. భర్తను చంపేసి.. చివరకు పోలీసులకు చిక్కిన ఓ మహిళ.. అనాథలుగా మారిన పిల్లలను చూసేవరకు తాను చేసిన తప్పు ఏంటో తెలుసుకోలేక పోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా గార్ల పట్టణంలో రామారావు అనే ట్రాక్టర్ యజమాని వద్ద పూమ్యతండాకు చెందిన భూక్యా రమేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిలో చేసేవాడు. యజమాని రామారావు డ్రైవర్ కోసం రోజూ.... అతని ఇంటికి వస్తూ పోతున్న సమయంలో డ్రైవర్ రమేష్ భార్యతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. 

కామంతో కళ్లు మూసుకుపోయిన వేళ ప్రియుడి మాయ మాటలతో ఏకంగా తన భర్తనే అంతమొందించాలని రమేష్ భార్య నిర్ణయించుకుంది. ప్రణాళిక రూపొందించుకొని, గత నాలుగు నెలల క్రితం పథకం ప్రకారం ఖమ్మం జిల్లాలో గల పాలేరు జలాశయం వద్దకు భర్తను తీసుకెళ్లి ప్రియుడు, ఆమె కలిసి రంపంతో రమేష్ మెడకోసేసి అతి కిరాతకంగా చంపి జలాశయంలో పడేశారు.
 
20 రోజుల తరవాత సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను కూసుమంచి, గార్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు శిక్ష పడింది. శనివారం రోజున షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. తండ్రి లేకపోవడంతో అనాథలుగా మారిన తన ఇద్దరు పిల్లలను చూసిన తల్లి ఒక్కసారిగా పిల్లలను పట్టుకొని బోరున విలపించింది. 

ఒళ్ళు మరిచి, తను చేసిన తప్పును తెలుసుకొని, తన పిల్లల పరిస్థితి ఏంటని ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. తనకు ఎవరూ మద్దతు ఇవ్వక పోవడంతో ఒంటరిగా పోరాడుతోంది. ‘నీ మాయమాటలు విని, ఒళ్ళు మరచి నా భర్తను చంపుకొని నాకు నేనే అన్యాయం చేసుకున్నా.. ఇప్పుడు నాకు న్యాయం చేయాలంటే నన్ను పెళ్ళి చేసుకుని నా పిల్లలకు తండ్రివి అవ్వు’ అని ప్రియుడిని గల్ల పట్టుకొని నిలదీసింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Prices : నిమ్మ ధర వింటే వామ్మో అనాల్సిందే... హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంత?
CM Revanth Reddy Ramp Walk At Nakirekal Meeting | Asianet News Telugu