30 రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రం: తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్

By narsimha lodeFirst Published Oct 24, 2021, 3:18 PM IST
Highlights

ఇటీవల కాలంలో రూ. 2 కోట్ల విలువైన మత్తు పదార్దాలను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నాడు సన్మానించారు. నెల రోజుల్లో రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను నియంత్రిస్తామన్నారు.

హైదరాబాద్: సీఎం Kcr ఆదేశాల మేరకు నెల రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
 ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులను మంత్రి V. Srinivas Goud సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆంధ్రా - ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా ల నుండి Ganja సహా Drugs తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లకుండా రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు ఇందుకోసం  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు  చేసిన విషయాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

also read:డ్రగ్స్ వినియోగం.. మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ బెటర్: సీపీ అంజనీ కుమార్

వచ్చే 30 రోజుల్లో రాష్ట్రంలో మత్తు పదార్థాల సరఫరా నిర్ములనే లక్ష్యంగా   ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ లో మంచి పనితీరును కనబరిచిన అధికారులను గుర్తించి వారికి అవార్డులు, రివార్డులు అందిస్తామన్నారు. మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారి వివరాలు, సమాచారాన్ని అందించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.  సమాచారం అందించిన వారికి తగిన ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.

 ఎక్సైజ్ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య గార్ల సూచనలతో మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లాలో ఆ శాఖ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్  నేతృత్వంలోని పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను  సీజ్ చేశారు.ఈ డ్రగ్స్ సీజ్ లో కీలకంగా వ్యవహరించిన అబ్కారీ శాఖ అధికారులను  మంత్రి ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ చంద్రయ్య, మేడ్చెల్ సూపరింటెండ్ విజయ్ భాస్కర్, సీఐ సహదేవ్ లను మంత్రి. శ్రీనివాస్ గౌడ్  అభినందించారు


 

click me!