Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ వినియోగం.. మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ బెటర్: సీపీ అంజనీ కుమార్

యువ‌త జీవితాల‌ను నాశ‌నం చేస్తోన్న డ్ర‌గ్స్‌కు (drugs) బానిస కాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో హైద‌రాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ (osmania university) ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద విద్యార్థుల‌తో క‌లిసి పోలీసులు ఆదివారం అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంక‌టేశ్, సుభాష్ రెడ్డి, ఓయూ వీసీ ర‌వీంద‌ర్ పాల్గొన్నారు. 

hyderabad police commissioner anjani kumar comments on drugs
Author
Hyderabad, First Published Oct 24, 2021, 2:37 PM IST

యువ‌త జీవితాల‌ను నాశ‌నం చేస్తోన్న డ్ర‌గ్స్‌కు (drugs) బానిస కాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో హైద‌రాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ (osmania university) ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద విద్యార్థుల‌తో క‌లిసి పోలీసులు ఆదివారం అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంక‌టేశ్, సుభాష్ రెడ్డి, ఓయూ వీసీ ర‌వీంద‌ర్ పాల్గొన్నారు. హైద‌రాబాద్ సీపీ (hyderabad police commissioner) అంజ‌నీ కుమార్ (anjani kumar ips) కూడా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. డ్ర‌గ్స్‌ వ‌ల్ల జ‌రిగే అన‌ర్థాల‌పై విద్యార్థుల‌కు ఆయ‌న వివ‌రించి చెప్పారు. భార‌త్‌లోని ఇత‌ర న‌గ‌రాల‌తో పోల్చి చూస్తే హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ స‌మ‌స్య అంత‌గా లేద‌ని తెలిపారు. అయినప్పటికీ న‌గ‌ర‌వాసులు డ్ర‌గ్స్ జోలికి వెళ్ల‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. డ్ర‌గ్స్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా కాలేజీలు, స్కూళ్ల‌లోనూ ప్ర‌చారం చేస్తామని సీపీ వెల్లడించారు.

Also Read:హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత..

కాగా.. శనివారం హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్  కలకలం రేపాయి. ఒకే రోజు రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు పంపించే పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నట్టుగా NCB అధికారులు  గుర్తించారు. ఇందులో ఉన్న 3 కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చెన్నైకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కు పార్సిల్‌ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. Chennai నిందితుడిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.

మరోవైపు మేడ్చల్ జిల్లాలో (medchal district) భారీగా  డ్రగ్స్ పట్టుబడ్డాయి. మూడు ప్రాంతాల నుంచి అధికారులు  రూ. 2 విలువచేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విద్యార్థులకు సరఫరా చేసేందు డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.. తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పవన్, మహేశ్ రెడ్డి, రామ‌క‌ృష్ణ గౌడ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ ఉన్నారు. కారును  సీజ్‌ చేశారు. వారి  నుంచి మొత్తంగా రూ. 4.92 కిలోల మెపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు ఎస్‌.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios