ఎమ్మెల్యేల సస్పెన్షన్ : బీజేపీకి చుక్కెదురు.. స్టే ఇవ్వలేం, తేల్చి చెప్పేసిన తెలంగాణ హైకోర్టు

By Siva KodatiFirst Published Mar 11, 2022, 2:42 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు సంబంధించి ఆ పార్టీ నేతలకు హైకోర్టు షాకిచ్చింది. సస్పెన్షన్‌పై స్టే విధించలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పేసింది. మరి దీనిపై తెలంగాణ బీజేపీ ఏం చేస్తుందో చూడాలి. 
 

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం. బీజేపీ  ఎమ్మెల్యేల పిటిషన్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 

కాగా.. Telangana Assembly Budget sessions ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో  బీజేపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని సభ నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా బీజేపీ ఎమ్మెల్యేలను suspend చేశారు. 

Latest Videos

ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టులో Petition  దాఖలు చేశారు. ఈ విషయమై గురువారం హైకోర్టులో విచారణ  జరిగింది.  శాసనసభ వ్యవహరాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. అయితే ముందస్తు ప్నలాన్ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 7న శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు వ్యతిరేక నినాదాలు చేశారు. . 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లను ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించారు.  మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్ రావు సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. 

click me!