అక్కడ టెలీమెట్రీలు అక్కర్లేదు.. ఏపీ వాదనను పట్టించుకోవద్దు: కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

By Siva KodatiFirst Published Sep 21, 2021, 7:43 PM IST
Highlights

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు (కేఆర్ఎంబీ) తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు (కేఆర్ఎంబీ) తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని గతంలో ఏపీ ప్రభుత్వం కోరిందని మురళీధర్ గుర్తుచేశారు. గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని ఏపీ కోరిందన్నారు. అయితే కృష్ణా నీరు ఇవ్వని ప్రాంతాలకే గోదావరి నీళ్లిస్తున్నామని తెలంగాణ ఈఎన్‌సీ లేఖలో ప్రస్తావించారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందని... ట్రైబ్యునళ్ల ప్రకారం అదనపు వాటా కిందికి కూడా ఇది రాదని ఆయన వెల్లడించారు. మిగులు నీటిని ఎగువ  ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చని.. తక్కువ నీటి మళ్లింపునకు టెలిమెట్రీలు అవసరం లేదు అని ఈఎన్‌సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.  

click me!