ఎన్నికల వేళ అస్త్ర సన్యాసం.. పోటీ నుంచి తప్పుకున్న పార్టీలు

By Rajesh Karampoori  |  First Published Nov 8, 2023, 7:13 PM IST

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో నిలిచి తాడో పేడో తేల్చుకోవాల్సిన రాజకీయ పార్టీలు.. ఎన్నిక ముంగిట పోటీ నుంచి తప్పుకుంటున్నాయి. పోటీ చేయకుండానే అస్త్ర సన్యాసం చేస్తున్నాయి.  


Telangana Elections 2023: భీకర యుద్దం జరుగుతుంటే రాజు స్వయంగా ఆయుధం చేతబడి కధనరంగంలోకి దిగి పోరాడితే సైన్యానికి కలిగే ఉత్సాహమే వేరే.. కానీ, యుద్దంలో  పాల్గొనకుండానే రాజు అస్త్ర సన్యాసం చేస్తే.. ఎత్తిన కత్తిని దింపితే ఓటమిని ఒప్పుకున్నట్లే కదా.. యుద్దం నుంచి నిష్క్రమించినట్టే కదా. సరిగ్గా ఇలాంటి పరిస్తితి తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. వాస్తవానికి ఎన్నికలంటే..  ప్రతీ రాజకీయ పార్టీకి ఓ యుద్ధంతో సమానమే.. యుద్ధంలో రాజులు వీరోచితంగా పోరాడి ఇతర రాజ్యాలను గెలిస్తే.. ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులు ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని దగ్గించుకుంటారు.  ఏ యుద్దంలోనైనా రాజు గెలువాలని చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తాడు. తాడోపేడో తేల్చుకుంటాడు. కానీ,ఈ ఎన్నికల సమరంలో మాత్రం కొందరూ పార్టీ అధినేతలు ఎన్నికలకు సిద్దమై.. చివరి నిమిషంలో  పోటీ నుంచి విరమించుకున్నారు. తాము ఎన్నికల్లో బరిలో నిలువలేమంటూ ఇతర పార్టీలకు మద్దతుగా నిలుస్తూ.. అస్త్ర సన్యాసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. 

తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, తెలంగాణ టీడీపీ, తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తాయి అందరూ భావించారు. అనుకున్న విధంగా తొలుత తమదైన శైలిలో అధికార పార్టీపై, ఇతర ప్రతిపక్షపార్టీలపై విమర్శలు గుప్పించాయి. కానీ.. అసలు సినిమా అదే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే పోటీ నుంచి తప్పుకున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ మరో సారి అధికారంలో రావాలని తీవ్రంగా శ్రమిస్తుంది. ఇక ప్రతి పక్ష కాంగ్రెస్,బీజేపీలు కూడా అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. వాస్తవానికి కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై పరోక్షంగా పడిందనే చెప్పాలి. కర్నాటక ఎన్నికల ఫలితాల ముందు ఉన్న జోరు బీజేపీలో ప్రస్తుతం లేదని  చెప్పాలి. దీనికి తోడు రాష్ట్ర నాయకత్వ మార్పు కూడా మరో కారణం కావొచ్చు. ఈ ఫలిత అనంతరం కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. కర్ణాటక మాదిరిగా అధికారం చేజిక్కించుకోని తెలంగాణలోను అధికార పీఠం దక్కించుకునేందుకు దూకుడు పెంచింది. 

Latest Videos

undefined

అస్త్ర సన్యాసం చేసిన ఆ మూడు పార్టీలు

అయోమయంలో కమ్యూనిస్టులు

ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇతర పార్టీలతో సరైన పొత్తు కుదరకపోవడంతో కాస్త అయోమయంలో పడ్డాయి. తొలుత అధికార బీఆర్ఎస్ తో పొత్తు పెడుకోవాలని భావించిన వామపక్షాలకు షాక్ తగిలింది.  బీఆర్ఎస్ మొండి చేయి చూపించడంతో కాంగ్రెస్ వైపు  తిరిగాయి. ఈ పార్టీతో కూడా పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరి ప్రయాణం చేస్తోంది. ఇక సీపీఐ పార్టీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ తో ఒక స్థానంలో పోటీకి అంగీకరించి ఎన్నికలకు సిద్ధమైంది. ఇక బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచింది. మరోవైపు.. ఎన్నికల ముందు వరకు హడావుడి చేసిన తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, తెలంగాణ టీడీపీ పార్టీలు తీరా సమయానికి బరి నుంచి తప్పుకుని అస్త్ర సన్యాసం చేశాయి.

నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకున్న కిషన్ రెడ్డి

ఎన్నికల ముందు కమలం అధినాయకత్వంలో అనూహ్యమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే.. అధికారాన్ని దక్కించుకోవాలని  ప్రయత్నిస్తున్న బీజేపీ ఇప్పటికే వంద స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది.  దూకుడుగా వ్యవహరిస్తూ..  అధికార బీజేపీకి గట్టిపోటీని ఇస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొని కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నాయి. అయితే.. ప్రచారం వేళ బీసీ నేతనే సీఎం చేస్తామని ప్రకటించడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో ముందుండి నడకపోవడం పట్ల కమలం పార్టీలోను చర్చ సాగుతోంది.  

బరి నుంచి తప్పుకున్న కోదండరాం

 

తెలంగాణ జన సమితి కూడా అనూహ్య నిర్ణయం  తీసుకుంది. ఆ పార్టీ అధినేత ఆచార్య కోదండరాం ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.  2018లో మహకూటమిగా కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలతో పోటీ చేసిన తెలంగాణ జన సమితి పార్టీ ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ తో కలిసి పోరు బాటలో సాగాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నప్పటికీ.. ఆ హస్తం పార్టీతో పొత్తు కుదరకపోవడంతో  వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు మరో పార్టీని ఆశ్రయించినట్టు సమాచారం.

షాకిచ్చిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుస కేసుల నమోదు కావడం, అరెస్టు, జైలు జీవితం వంటి అంశాలతో తెలంగాణ రాజకీయాలపై సైకిల్ పార్టీ ఫోకస్ చేయలేకపోయింది.  తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న టీడీపీ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు షాక్ గురయ్యారు. అప్పటి వరకు ఉన్న ఉత్సాహం కాస్తా నీరుగారిపోయింది. తరుణంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో  తెలంగాణ టీడీపీకి నాయకుడే లేకుండా పోయాడు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి టీపీడీ
తెరవెనుక మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

షర్మిల అనూహ్య నిర్ణయం

రాజన్న రాజ్యం తెస్తామంటూ తెలంగాణలో 2021 నుండి విస్తృతంగా పాదయాత్ర చేసిన వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ దఫా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల వేళ తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావించినా ఫలితం లేకుండా పోయింది. ఆపార్టీ విలీనం చేసుకునే విషయంలో కాని సానుకూలంగా స్పందించలేదు. తెలంగాణ రాజకీయాల కన్నా ఆంధ్ర రాజకీయాలపై దృష్టి సారించమని షర్మిళకు సూచించినట్లు సమాచారం. షర్మిళ  అనూహ్య నిర్ణయంతో  ఆ పార్టీ తన ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

చివరి నిమిషంలో బరిలో నిలిచిన జనసేన

ఆంధ్రప్రదేశ్ వేదికగా రాజకీయాలు చేసిన జన సేన చివరి నిమిషంలో బీజేపీతో కలిసి తెలంగాణ వేదికగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల పోరులో ఆంధ్ర సెటిలర్లను లక్ష్యంగా చేసుకుంది. 32 స్థానాల్లో పోటీ చేయాలని సిద్ధపడ్డ 9 స్థానాల్లో మాత్రమే అవకాశం ఇవ్వాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికల సమయంలో పడుతాయనే చర్చ కూడా సాగుతోంది.

click me!