డ్రగ్స్‌పై ఉక్కుపాదం: ఈ నెల 20న ఎక్సైజ్,పోలీసులతో కేసీఆర్ భేటీ

By narsimha lodeFirst Published Oct 18, 2021, 6:58 PM IST
Highlights


తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 20న  డ్రగ్స్ అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు.పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులతో  కేసీఆర్ భేటీ కానున్నారు.

హైదరాబాద్: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సీఎం Kcr ఆదేశించారు. ఈ నెల 20వ తేదీన పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులతో కేసీఆర్ భేటీ కానున్నారు.తెలంగాణ రాష్ట్రం Drugs రహిత రాష్ట్రంగా ఉండాలని కేసీఆర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యువత డ్రగ్స్ బారినపడకుండా చర్యలు తీసుకోవాలని కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

also read:జైలు నుంచి షారూక్ కి ఆర్యన్ ఖాన్ వీడియో కాల్.. ఏం మాట్లాడాడంటే..!

తెలంగాణలో Tollywood drugs  కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖలు ఎక్సైజ్, ఈడీ అధికారులు హాజరయ్యారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగు చూసిన సమయంలో  హైద్రాబాద్ నగరంలో స్కూల్స్ లో కూడ డ్రగ్స్ సరఫరా అయినట్టుగా ఎక్సైజ్ శాఖాధికారులు గుర్తించారు.నైజీరియాకు చెందిన కొందరు చదువుకొనే పేరుతో హైద్రాబాద్ కు వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు తమ దర్యాప్తులో తెలుసుకొన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కొందరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Hyderabad నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడ లేకపోలేదు. దీంతో పబ్‌లపై కూడ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.హైద్రాబాద్ లో కూడ పలు చోట్ల డ్రగ్స్ పట్టుకొన్న ఘటనలు చోటు చేసుకొన్నాయి.ఈ తరుణంలో సీఎం కేసీఆర్ డ్రగ్స్ విషయమై సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గంజాయి పై పోలీసులు నిఘా పెట్టారు. వందల కొద్దీ కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 150 మందిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు 23 మందిపై పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు.


 

click me!