CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నది. ఎన్నికల హామీ అమలులో భాగంగా రేవంత్ సర్కార్ కీలక చర్చలు తీసుకుంటుంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నది. ఎన్నికల హామీ అమలులో భాగంగా రేవంత్ సర్కార్ కీలక చర్చలు తీసుకుంటుంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి .. రైతుల రుణమాఫీ, వరి సేకరణకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని.. రుణమాఫీ పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, సాధారణ ఆదాయ వ్యయాల వివరాలను కూడా సీఎం సమీక్షించారు.
undefined
లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసే లోగా రుణమాఫీకి తగినన్ని నిధులు సమీకరించాలని అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసేందుకు తగిన విధివిధానాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రుణమాఫీ పథకానికి నిధులు సమీకరించాలని అధికారులను ఆదేశించారు.
రైతులను రుణభారం నుంచి విముక్తం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున, నిర్ణీత గడువులోగా నిధుల సేకరణకు కృషి చేయాలని అధికారులను సీఎం కోరారు. నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకర్లను సంప్రదించాలని, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో రైతు రుణమాఫీకి సంబంధించి అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, సన్నబియ్యాన్ని సరసమైన ధర దుకాణాలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే వరి సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. తక్షణమే మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని, తేమ శాతం ఎక్కువగా ఉన్న వరి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.