తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

By Siva Kodati  |  First Published Sep 9, 2019, 11:33 AM IST

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పోందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించింది.


2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పోందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించింది. ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

బడ్జెట్ ముఖ్యాంశాలు:

Latest Videos

* రెసిడెన్షియల్ పాఠశాలల కొనసాగింపు
* ఆరోగ్యశ్రీకి రూ. 1,336 కోట్లు
* కొత్త జోనల్ వ్యవస్ధ ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
* కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన
* గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ. 339 కోట్లు
*  గ్రామ పంచాయతీలకు బడ్జెట్‌లో 2,714 కోట్లు కేటాయింపు
* మున్సిపాలిటీలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు

* యథాతథంగా ఉచిత విద్యుత్ పథకం,  ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణ లక్ష్మీ, ఆరోగ్య లక్ష్మీ, ఆరు కిలోల బియ్యం పథకాలు
* ఆసరా పెన్షన్ల సాయం రెట్టింపు
* వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, నేత-గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంపు
* వికలాంగులు, వృద్ధ కళాకారులకు రూ.1,500 నుంచి రూ. 3,016 రూపాయలకు పెంపు
* పెన్షన్ వయో పరిమితి 65 ఏళ్ల నుంచి 57కి తగ్గింపు
*  బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ తొలగింపు
* ఆసరా పెన్షన్ల నిమిత్తం రూ. 9,402 కోట్లు కేటాయింపు

* రైతు బంధు పథకం కింద సాయం రూ. 8,000 నుంచి రూ.10 వేలకు పెంపు ఇందుకోసం రూ. 12 వేల కోట్లు
* రైతు బీమా ప్రీమియం కోసం రూ.1,137 కోట్లు
* పంట రుణాల మాఫీల రూ. 6 వేల కోట్లు
* వ్యవసాయ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది
* విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8 వేల కోట్లు

* రూ.1,03,551 కోట్ల రూపాయల మూలధన వ్యయం పెరిగింది
* 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం రూ. 1,46,492.30 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు కాగా.. మూలధన వ్యయం 17,274,67 కోట్ల రూపాయలు
* మిగులు రూ. 2,044.08 కోట్లు కాగా.. ఆర్ధిక లోటు 24,081.74 కోట్లు

* గడచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
* వినూత్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది
* వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం
* వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 8.1 శాతం నమోదు
* ప్రభుత్వ ఆర్ధిక విధానాల ద్వారా మూలధన వ్యయం పెరిగింది.
* ఆర్ధిక మాంద్యం ప్రస్తుతం దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది
* అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనం వైపుగా సాగుతోందని అనేక సంస్థల సర్వేలు చెబుతున్నాయి

* గత ఆర్ధిక సంవత్సరంలో 5.8 శాతం వృద్ధి
* ఐటీ ఎగుమతుల విలువ రూ. 1,10,000 కోట్లు
* మిషన్ భగీరథతో నీటి సమస్య పరిష్కారం
* కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాలతో మరింత పారదర్శక పాలన
* మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగుపడుతుంది
* ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతలను మారుస్తాం
* మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు
* 18 నెలలుగా ఆర్ధిక మాంద్యం కొనసాగుతోంది
* రైతు బంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుంది
* కాళేశ్వరం సహా భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు కొనసాగింపు
* స్థానిక సంస్థలకు నిధుల కొరత లేకుండా చర్యలు
* కేంద్ర పథకాల అమలు కోసం అందిన నిధులు రూ. 31,802 కోట్లు మాత్రమే 
* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీసీ వృద్ధి రేటు 10.5 శాతం

click me!