కర్ణాటక కలబురిగి జిల్లా కమలపురా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: Karnataka కలబురిగి జిల్లా కమలపురా వద్ద జరిగిన Road accidentలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం KCR అధికారులను ఆదేశించారు.
ఇవాళ ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని kalaburagi వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. మృతుల కటుంబాలకు రూ. 3 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలల ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు.
undefined
గోవా నుండి హైద్రాబాద్ కు వస్తున్న orange ట్రావెల్స్ బస్సు కలబురిగి జిల్లా కమలాపురా పట్టణ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపో ట్రాక్స్ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు గోవా నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కలబురిగిలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
also read:రాంగ్‌రూట్లో వచ్చే వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం: కర్ణాటక ప్రమాదంపై ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం
ఈ ప్రమాదంలో 12 మందిని రక్షించారు. ఈ ఘటనలో చనిపోయిన వారు హైద్రాబాద్ కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 35 మంది ఉన్నారుహైద్రాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి అర్జున్ తన కూతురు బర్త్ డే వేడుకలకు గాను బంధువులు, స్నేహితులతో కలిసి గోవా వెళ్లినట్టుగా సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.ఈ ఘటనలో మరణించిన వారిని అర్జున్, సరళ, శివకుమార్, రవళి, దీక్షిత్,అర్జున్, అనితతో మరొకరు మరణించారు. బస్సులోని 35 మందిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 25 మంది ఉన్నారు.