2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

By narsimha lodeFirst Published Nov 16, 2018, 10:57 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డిపై 36 కేసులు ఉన్నాయి. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డిపై 36 కేసులు ఉన్నాయి.  ఓటుకు నోటు కేసు సహా 36 కేసులు ఈ నాలుగు ఏళ్లలో  నమోదయ్యాయి.

2014 ఎన్నికల సమయంలో  రేవంత్ రెడ్డి దాఖలు చేసిన  అఫిడవిట్‌లో  ఒక్క కేసు కూడ  లేదు. కానీ, ఈ నాలుగేళ్లలో మాత్రమే రేవంత్ రెడ్డిపై 36 కేసులు నమోదయ్యాయి.

 రేవంత్‌పై నమోదైన కేసుల్లో  ఎక్కువగా శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారనే  కేసులు ఎక్కువగా ఉండడం గమనార్హం.    గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  నమోదైన ఓటుకు నోటు కేసులో  కూడ రేవంత్‌రెడ్డి నిందితుడుగా ఉన్నాడు. 

మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుండి సీఎం కేసీఆర్  ముడుపులు తీసుకొన్నారని  రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కూడ కేసు ఉంది. గత ఎన్నికల సమయానికి ఒక్క కేసు కూడ లేకపోయినా... ఈ ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డిపై  36 కేసులు నమోదు కావడం గమనార్హం.  

తనపై నమోదైన కేసుల వివరాల కోసం  రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.  రేవంత్ పై నమోదైన కేసుల వివరాలను  ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ  పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ తనపై  నమోదైన కేసుల వివరాలను సమర్పించారు.

రేవంత్‌రెడ్డికి  రూ.1,74,97,421  చరాస్తులు,,  రూ.2,02,69,000 స్థిరాస్తులు ఉన్నాయి. రేవంత్ సతీమణి పేరిట చరాస్తులు రూ.2,27,79,935, రూ.2,36,40,000 స్థిరాస్తులున్నాయి. 

సంబంధిత వార్తలు

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్


స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

click me!