BRS-KCR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అధికారం పీఠం దక్కించుకోవడానికి అన్ని పార్టీలు తమ ముందున్న అన్ని వనరులను ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా, ప్రస్తుతం బీఆర్ఎస్ గా మారిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోందతి. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో విజయం సాధించి, 2018లో మళ్లీ గెలిచి వరుసగా రెండో సారి అధికారం చేపట్టింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తోంది.
Telangana Assembly Elections 2023: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అధికారం పీఠం దక్కించుకోవడానికి అన్ని పార్టీలు తమ ముందున్న అన్ని వనరులను ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా, ప్రస్తుతం బీఆర్ఎస్ గా మారిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోందతి. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో విజయం సాధించి, 2018లో మళ్లీ గెలిచి వరుసగా రెండో సారి అధికారం చేపట్టిందతి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇంతకుముందులా ఈ సారి బీఆర్ఎస్ కు గెలుపు అంత సులువుగా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే.. అధికార వ్యతిరేకత, కాంగ్రెస్ దూకుడు, బీఆర్ఎస్ ను ఇరికించే బీజేపీ వ్యూహాలను కేసీఆర్ పార్టీ ఎదుర్కొవాల్సి ఉంటుంది.
పెట్టుబడులు, శాంతిభద్రతలతో సహా తన ట్రాక్ రికార్డ్‌పై హ్యాట్రిక్ ఎన్నికల విజయాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పునరుజ్జీవింపబడిన, ఆత్మవిశ్వాసంతో కూడిన కాంగ్రెస్.. దూకుడుగా ఉన్న బీజేపీతో పోరాడవలసి ఉంటుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ పార్టీ తన బలహీనతలను తట్టుకుని విజయ తీరాలను తాకుతుందా? తన బలంతో కాంగ్రెస్, బీజేపీలను తట్టుకోగలుగుతుందా..?
undefined
బీఆర్ఎస్ బలాలు గమనిస్తే..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపిన ఏకైక వ్యక్తిగా కేసీఆర్ గుర్తింపు పొందారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగు నీటి ప్రాజెక్టులు, ఇంటింటికి మంచి నీరు, కేసీఆర్ కిట్‌ల వంటి కొన్ని ప్రభుత్వ పథకాలు ఆయనకు ఆదరాభిమానాలు తెచ్చిపెట్టాయి. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలు, వైద్యరంగంలో విశేషమైన మార్పు వచ్చింది. దీనికి తోడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం బీఆర్ఎస్ కు కొంత సానుకూల పరిణామాలు కల్పించిందనే చెప్పాలి. బీర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారు స్నేహపూర్వకంగా సర్కారుగా గుర్తింపు పొందింది. దీంతో గత తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఘనమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కేసీఆర్ సుస్థిర ప్రభుత్వాన్ని నడిపించారు. మొత్తం రాష్ట్ర జనాభాలో దాదాపు నాలుగో వంతు జనాభా ఉన్న హైదరాబాద్ సిటీ కేసీఆర్ తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ప్రత్యక్ష పర్యవేక్షణలో గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందింది. గడచిన తొమ్మిదేళ్లలో పార్టీ సంస్థాగత నిర్మాణాలు అట్టడుగు స్థాయిలో బలోపేతం అయ్యాయి. బీఆర్ఎస్ సర్కారులో నగదు సమృద్ధిగా ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలు వచ్చినా నిధుల కొరత వంటి అంశాలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి ఆయా అంశాలు బీఆర్ఎస్ కు బలాన్ని ఇచ్చాయి.
బీఆర్ఎస్ బలహీనతలు గమనిస్తే..
అనేక మంది సిట్టింగ్ బీఆర్ఎస్ శాసనసభ్యులు పార్టీలో అధికార వ్యతిరేకత, అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ 'కుటుంబ పాలన' ఆరోపణలు, సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కే.కవితపై అవినీతి ఆరోపణలు ఎన్నికల అంశంగా మారవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సాధించిన అద్భుతమైన విజయం రాజకీయ కథనాన్ని మార్చింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రంలో దెబ్బతిన్న బీజేపీ సైతం అంత బలీయమైనది కాదు. ఇది ఓట్ల చీలికను తగ్గించి, ప్రత్యర్థి ఓట్లను ఒక పార్టీకి, కాంగ్రెస్‌కు ఏకీకృతం చేయడానికి దారితీయవచ్చు.
విజయ అవకాశాలు..
సాపేక్షంగా బలహీనమైన ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నాయకులు, శాసనసభ్యులు పార్టీ మారారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటిలోనూ అంతర్గత పోరు కొనసాగుతోంది. ఇది అధికార పార్టీకి సానుకూలంగా మారుతున్న అంశం. కాషాయ పార్టీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ సృష్టించిన టెంపోను బీజేపీ కోల్పోయింది. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించడం స్థానికంగా పార్టీకి బలహీనతగా భావిస్తున్నారు. ఇంతకు ముందులా బీజేపీలో జోష్ కనిపించడం లేదు. విపక్షాల ఓట్లు కాంగ్రెస్, బీజేపీల మధ్య సమానంగా చీలితే ముక్కోణపు పోటీ బీఆర్‌ఎస్‌కు లాభిస్తుంది.
బీఆర్ఎస్ భయాలు..
లొంగని బీజేపీ, దాని పటిష్టమైన నాయకత్వం బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే అంశం కావచ్చు. ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయ భూమి, రెండు పడక గదుల ఇళ్ల పథకాలు వంటి కొన్ని పథకాలు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రతిపక్షాలు దీనిని ఎన్నికల అంశంగా మార్చవచ్చు. దళిత బంధు పథకం కింద ఎస్సీ కుటుంబాలకు రూ. 10 లక్షలు అందజేయడం ఇతర వర్గాల్లో అసంతృప్తిని కలిగించవచ్చు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో కవిత పేరును ప్రస్తావించారు. ఇది పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆయా అంశాలను ఎత్తిచూపవచ్చు. పార్టీ పేరు టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారడం ఇప్పటి వరకు రాజకీయాలకు మూలమైన తెలంగాణ గుర్తింపును వదులుకున్నట్లు ప్రతిపక్షాలు ఆస్త్రంగా మార్చుకోవచ్చు. బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రజలలో సాధారణ భావన పార్టీ ఎన్నికల అవకాశాలను దెబ్బతీయవచ్చు. అలాగే, TSPSC పేపర్ లీక్‌ను నిరోధించకపోవడం, నిరుద్యోగుల అందోళన కలిగించే విషయాలు పార్టీ గెలుపునకు ప్రతికూలంగా మారే అవకాశముంది.